బాసర ఆలయానికి రూ.2.50 లక్షల విరాళం
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలోని ఉచిత అన్నదాన సత్రంలో నూతన బాయిలర్ ఏర్పాటుకు ఓ భక్తుడు రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. హైదరాబాద్ కు చెందిన వంగూరి గౌతమ్–కుసుమశ్రీ కుమారుడు రుద్రవిహాన్ కుటుంబ సభ్యులు గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొదటి విడతగా బాయిలర్ మెషీన్ కోసం ఎస్‌ఎస్ ఫ్యాబ్రికేషన్ హైదరాబాద్ వారికి రూ.50 వేలు ఆలయ అధికారికి అందించారు. బాయిలర్ పనులు పూర్తయ్యాక పది రోజుల్లో మిగతా రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment