ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి

Published Fri, Mar 7 2025 9:33 AM | Last Updated on Fri, Mar 7 2025 9:29 AM

ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి

ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి

నిర్మల్‌ టౌన్‌: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి సూచించారు. ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5 వరకు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై ప్రొజెక్టర్‌ ద్వారా తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యం, సృజనాత్మకతను పెంచడానికి ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థను సొంత సంస్థగా భావించి పనిచేయాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, ఏఈ నవీన్‌కుమార్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement