పన్ను చెల్లించని ఇల్లు సీజ్
ఖానాపూర్: పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన రాములు రూ.15,880 ఇంటి పన్ను చెల్లించకపోవడంతో ఆ ఇంటిని సీజ్ చేశామని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. వార్డు అధికారులు ధీరజ్, రాహు ల్, లతీఫ్, రాజశేఖర్, బిల్ కలెక్టర్ అభినయ్ సిబ్బందితో కలిసి గురువారం ఇంటికి తాళం వేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరా రు. నూతన మున్సిపాలిటీలో నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది వేతనాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహాకారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment