బేటీ బచావో–బేటీ పడావో జిల్లాస్థాయి పోటీలు
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో– బేటి పడావో’ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 8, 9 తరగతి బాలికలకు గురువారం జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 100 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. 25 మంది విద్యార్థినులను విజేతలుగా ప్రకటించారు. వీరికి మహిళా దినోత్సవం రోజున కలెక్టర్ అభిలాష అభినవ్ బహుమతులు ప్రదానం చేస్తారని డీఎస్‌వో వినోద్‌కుమార్ తెలిపారు. విజేతలను డీఈవో రామారావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment