నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో శుక్రవారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డవుతున్న విధానాన్ని పరిశీలించా రు. తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. గోదాం తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని పర్యవేక్షకులకు సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు గాజుల రవికుమార్, కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, మహ్మద్ నయీ మ్, నరేశ్, భద్రత సిబ్బంది, అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment