ఓ మహిళా.. చట్టం తెలుసుకో..
● సీ్త్రల కోసం ఎన్నో చట్టాలు ● అవగాహన లేక ఇబ్బందులు
నిర్మల్: పరసీ్త్రని కూడా తల్లితో సమానంగా చూడాలని మన ధర్మం చెబుతోంది. కానీ.. చాలామంది భార్యాపిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యనే శరణ్యమనుకుంటున్నారు. కానీ.. మన దేశంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలున్నాయి. మహిళా దినోత్సవం నేపథ్యంలో నిర్మల్‌కు చెందిన న్యాయవాది సీహెచ్ అర్చన మహిళలకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించి వివరించారు.
నిర్భయ చట్టం 2013: ఈ చట్టాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో తీసుకువచ్చింది. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేర కు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని నిర్ణయించింది. అత్యాచారం, మహిళలకు సంబంధించిన ఇతర నేరా ల్లో నిందితులకు మరణ శిక్ష కూడా పడేలా కఠినతరం చేసింది.
సమాన వేతన హక్కు చట్టం: ఏ యజ మాని కూడా వేతనాలు లేదా నియామకాల్లో లింగ వివక్ష చూపరాదు. వేతన వివక్ష ఎదుర్కొంటే మహిళలు లేబర్ కోర్టును సంప్రదించవచ్చు.
ఆస్తి హక్కు: హిందూ వారసత్వ చట్టం–1956 ద్వా రా ఈ హక్కు కల్పించారు. 2005లో సవరించారు. కుమార్తెలకు వారి పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమాన హక్కులున్నాయి. తండ్రి వీలు నామా లేకుండా మరణించినప్పటికీ కుమార్తె కు ఆమె సోదరులతో సమాన వాటా ఉంటుంది. ఇది వివాహిత కుమార్తెలకూ వర్తిస్తుంది.
గృహ హింస నిరోధక చట్టం 2005: జీవిత భాగస్వామి, అత్తమామలు లేదా కుటుంబ స భ్యుల నుంచి శారీరక, మానసిక, లైంగిక లేదా ఆర్థి క వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ చ ట్టం కింద రక్షణ పొందవచ్చు. ఇది భర్త లేదా అత్తమామల యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును మంజూరు చేస్తుంది. జీవన భృతి, కస్టడీ ఉత్తర్వులు, రక్షణ అందిస్తుంది.
లింగ ఎంపిక నిషేధ చట్టం 1994: భారతదేశంలో సీ్త్ర భ్రూణ హత్యలను ఆపడానికి, క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని అరికట్టడానికి భారత పార్లమెంట్ రూపొందించిన చట్టమిది. ఈ చట్టం ప్రకారం సీ్త్రల పట్ల వివక్షత నివారించడం, లింగ ఎంపిక, గర్భస్రావం ద్వారా స్రీ్త్రభూణ హత్యలను నిషేధించారు. తల్లి/బిడ్డ ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే పరిస్థితుల్లో, జన్యుసంబంధిత వ్యాధులకు మాత్రమే తల్లి అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకునే అవకాశముంది. అక్రమంగా స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడి చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినశిక్షలు విధిస్తారు.
పని ప్రదేశంలో వేధింపులు: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి, లైంగిక వేధింపుల ఫిర్యాదులు, పరిష్కారం కోసం పని ప్రదేశాల్లో వేధింపులు, నివారణ, నిషే ధం, పరిహారం చట్టం–2013 రూపొందించారు. ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
వరకట్న నిషేధ చట్టం–1961: ఈ చట్టం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడాన్ని నిషేధించింది. ఈ చట్టా న్ని అతిక్రమిస్తే ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.15వేలదాకా జరిమానా విధించడానికి ఆస్కా రం ఉంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కట్నం అడిగితే ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10వేలవరకు జరిమానా విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment