● తమ కాళ్లపై తాము నిలుస్తూ..● మరికొందరికి ఉపాధినిస్తూ..
చేప పచ్చళ్లను తయారు చేస్తున్న మహిళలు
వావ్.. అనిపించే ఫిష్‌పికిల్
చేపలంటే నాన్‌వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తినలేం. అలాంటివాళ్లకు ఇంట్లోనే పికిల్ (పచ్చడి) రూపంలో చేపలను అందించే ఆలోచనతో వాళ్లు ముందుకువచ్చారు. కడెం మండల కేంద్రానికి చెందిన 50 మంది మహిళలు ఇందిరా మహిళాశక్తి పథకం, ఈడీఐఐ యాక్సెంచర్ ఎన్‌జీవో సహకారంతో చేపలు, రొయ్యలతో పాటు చికెన్ పచ్చళ్లు తయా రు చేస్తున్నారు. స్థానికంగా లభించే రొయ్యలను ఎండబెట్టి విక్రయిస్తున్నారు. వీరు చేసే పచ్చళ్లు నాణ్యతతో ఉండటంతో స్థానికంగానే కాకుండా మలేషియా, దుబాయి నుంచీ డిమాండ్ పెరుగుతోంది. వారికి ఆదాయమూ కలిసి వస్తోంది.
నాణ్యత పాటిస్తున్నాం
స్థానికంగా చేపలు ఎక్కువగా లభిస్తాయి. మాకు అవగాహన ఉన్న పచ్చళ్ల తయారీనే ఉపాధిగా మార్చుకుని నాణ్యతతో అందిస్తున్నాం. పచ్చళ్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మాకు ఆదాయం లభిస్తోంది.
– రేణుక, కడెం
● తమ కాళ్లపై తాము నిలుస్తూ..● మరికొందరికి ఉపాధినిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment