పిచ్చుకల కోసం వరికుచ్చులు
కనుమరుగైపోతున్న పిచ్చుకలను మళ్లీ మన ఇంటికి రప్పించే ఓ మంచి ప్రయత్నాన్ని నిర్మల్ మండల మహిళా సమాఖ్య చేపట్టింది. వాటి పొట్ట నింపేలా, ఇంటికి లక్ష్మీకళ తెచ్చేలా వరికుచ్చుల తయారీని చేపట్టింది. నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్‌లో గణపతి స్వయంసహాయక సంఘం మహిళలు చేస్తున్న సమీకృతసాగులో భాగంగా పండిస్తున్న వరితోనే ఈ కుచ్చులను చేస్తుండటం విశేషం. డీఆర్డీవో విజయలక్ష్మి ఆలోచనతో ప్రారంభమైన ఈ వరికుచ్చులకు డిమాండ్ పెరుగుతోంది. నిర్మల్‌నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ తదితర జిల్లాలకూ తీసుకెళ్తున్నారు.
సేవ్‌బర్డ్స్ నినాదంతోనే..
పిచ్చుకలను రక్షించాలన్న నేపథ్యంలో వరికుచ్చుల తయారీ ఆలోచన వచ్చింది. రెగ్యులర్‌గా కావాలంటూ హైదరాబాద్ నుంచి ఇటీవల చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒక్కో వరికుచ్చును రూ.300కు విక్రయిస్తున్నాం. సభ్యులకు పనితోపాటు లాభం, పిచ్చుకలకూ ఆహారం అందుతోంది.
– విజయలక్ష్మి, డీఆర్డీవో
పిచ్చుకల కోసం వరికుచ్చులు
Comments
Please login to add a commentAdd a comment