అమెరికాకు పిండివంటలు..
ఎక్కడో ఉన్న అమెరికాకు ఇక్కడి ఓ పల్లెటూరి మహిళలు పిండివంటలు చేసి పంపిస్తున్నారు. ఆస్ట్రేలియా, దుబాయి వాసులకూ తమ చేతివంటల రుచి చూపిస్తున్నారు. లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సరస్వతీ గ్రామైక్య సంఘం సభ్యులైన గొల్లమాడ ప్రణిత, శైలజ, వనజ, మాధురి, లక్ష్మి తమకు వచ్చిన వంటనే తమకు ఆసరాగా మార్చుకున్నారు. వారంతా కలిసి అన్నపూర్ణ క్యాటరింగ్ పెట్టుకున్నారు. చకినాలు, గారెలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు తదితర పిండివంటలు చేస్తున్నారు. శుభకార్యాల కోసం కూడా వంటలు చేసిస్తున్నారు. వీరు చేస్తున్న పిండివంటలు రుచిగా ఉండటంతో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి తదితర దేశాలకూ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి తిన్నవారు మళ్లీమళ్లీ పంపించాలని కోరుతుండటం గమనార్హం.
వచ్చిన పనితోనే ఉపాధి
మేము ఏదైనా ఉపాధి పొందాలనుకున్నాం. మా కు వచ్చిన వంటలనే ఉపాధిగా మలుచుకున్నాం. ఇందుకు రూ.2లక్షల రుణం తీసుకుని నెలకు రూ.8వేల చొప్పున చెల్లిస్తున్నాం. మిగిలిన లాభాన్ని అందరం పంచుకుంటున్నాం.
– గొల్లమాడ ప్రణిత, కిష్టాపూర్
అమెరికాకు పిండివంటలు..
Comments
Please login to add a commentAdd a comment