రోడ్డు కోసం నిరాహార దీక్ష
భైంసాటౌన్: తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని మండలంలోని ఖత్‌గాం గ్రామస్తులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని ఖత్‌గాం ప్రవేశమార్గం వద్ద నిరాహార దీక్ష శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణం నుంచి తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని తెలిపారు. రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. భైంసా నుంచి ఖత్‌గాంకు, కామోల్‌కు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దీక్షలో మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment