విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
నిర్మల్‌రూరల్: విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ భవనంలో శనివారం వేడుకలు నిర్వహించారు. డీఈవో హాజరై మాట్లాడారు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, చైతన్య వంతురాలైన ఉపాధ్యాయురాలుగా మహిళలు ఎన్నో పాత్రలు పోషిస్తూ సమాజాభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో కీలకంగా మారారన్నారు. మహిళలు సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో ముందుంటారని తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసే విధంగా సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు డీ ఈవో జ్ఞాపికలు అందించి సత్కరించారు. వేడుకల్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్, ప్ర ధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారా యణ, తాళ్ల రవి, శ్రీదేవి, మీనాకుమారి, సుజాత, హేమలత, సౌజన్య, నీరజరాణి పాల్గొన్నారు.
మహిళా దినోత్సవానికి హాజరైన మహిళా ఉపాధ్యాయులు
విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
Comments
Please login to add a commentAdd a comment