లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం
నిర్మల్‌టౌన్: లోక్ అదాలత్‌లతో కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని, సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణకుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు 06, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు సంబంధించిన కేసులు 96, క్రిమినల్ కేసులు 1,085, సైబర్ క్రైమ్ 1,220 కేసులు పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్జీలు రాధిక, శ్రీనివాస్, భవిష్య, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment