‘అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు’
ఖానాపూర్: నిరుపేదల గుడిసెను అటవీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో అధికారులు కూల్చివేసిన గుడిసెను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 2004 నుంచి భూపోరాటం ద్వారా సాధించుకున్న 70 ఇళ్లలో గ్రామపంచాయతీలో పన్నులు చెల్లించి జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులకు నిలువ నీడ లేకుండా అధికారులు వ్యవహరించిన తీరును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఇదే ఇల్లుపై ఇందిరమ్మ ఇల్లు సైతం నిర్మించుకొని సగానికిపైగా బిల్లుసైతం పొందారన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం లింగన్న, గోనె స్వామి, గోగు శేఖర్, వేగుల గంగన్న, రాములు, భీంరావు, శంకరయ్య, భూమక్క, చంద్రకళ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment