భైంసాటౌన్: పట్టణం నుంచి మండలంలోని ఖత్‌గాం–కామోల్ వరకు రోడ్డు నిర్మించాలంటూ గ్రామ మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం సా యంత్రం విరమించారు. రెండోరోజు దీక్షకు మద్దతుగా భైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ పిప్పె ర కృష్ణ, డైరెక్టర్ తోట రాముతో పాటు పలు వురు పాల్గొన్నారు. సాయంత్రం పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, భైంసా డీఈఈ రాజేందర్ దీక్ష విరమించాలని కోరారు. భైంసాలోని హైవే నుంచి ఖత్‌గాం వరకు రూ.99 లక్షలతో రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నిధుల లేమితో పనులు నిలిచాయన్నారు. ఏప్రిల్ మొదటివారంలో పనులు చేపట్టేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు దీక్ష విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment