మూడునెలల్లో పనులు ప్రారంభించాలి
● బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్: ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ విషయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడటం సరికాదని, తాను ఏపార్టీలో ఉండి మాట్లాడుతున్నారో తెలుసా.. అని బీజేఎల్పీనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఆయిల్‌పామ్ కంపెనీకి 40ఎకరాల ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఇచ్చినపుడు, నిర్మల్‌లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఫ్యాక్టరీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నా చేయాలన్నారు. మూడునెలల్లో జిల్లాలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించకపోతే తామే భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, నాయకులు ముత్యంరెడ్డి, భూపాల్ రెడ్డి, సాదం అరవింద్, భూపతిరెడ్డి, వొడిసేల అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment