● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
ఈ చిత్రం నిర్మల్ జిల్లాకేంద్రంలోని గొల్లపేటలోనిది. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇలా రంగు మారిన నీరు వస్తోంది. పట్టణంలో చాలా కాలనీలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన కూడా వస్తోంది. ఈ నీటిని తాగడానికి పట్టణవాసులు భయపడుతున్నారు. ఇతర అవసరాలకు వినియోగించి.. తాగునీటిని కొనుక్కుంటున్నారు.
ఈ చిత్రం భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌లోనిది. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నీరు రాలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో మున్సిపల్ బోరు మోటార్ నీటినే తాగునీటితోపాటు ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు.
వేసవికి ముందే తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో లీకేజీలతో నీరు వృథా అవుతోంది. కొన్ని కాలనీల్లో ప్రజలు నీటిని వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో తాగునీటి పరిస్థితి తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేసింది. ప్రస్తుతానికి పెద్దగా సమస్య లేకపోయినా.. నీటి వృథాతో రాబోయే రోజుల్లో వ్యథ తప్పేలా లేదు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా, నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో నీటి సరఫరా సమయంలో వృథాగా వదిలేస్తున్నారు. దీంతో 30 శాతం వరకు నీరు వృథా అవుతోంది. ఇంకా కొన్నిచోట్ల నల్లా కనెక్షన్ ఉన్నా ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ బోర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. పేదలు బోరు నీటినే తాగుతున్నారు.
నిర్మల్‌లో కలుషిత నీరు..
నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలో నీటి సమస్య పెద్దగా లేకున్నా.. చాలాచోట్ల లీకేజీలు ఉన్నాయి. ఈ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. పలు కాలనీల్లో రంగు మారుతుండటంతో స్థానికులు నీటిని తాగడం లేదు. 42 వార్డులకుగాను 39 వార్డుల్లో ప్రతీరోజు మంచినీటి సరఫరా అవుతోంది. బుధవార్‌పేట్, గాజుల్‌పేట్, వైఎస్సార్ కాలనీలో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. మొత్తం 21,800 నల్లా కలెక్షన్లు ఉండగా, 174 మోటర్లు ఉన్నాయి. కార్మికులు 116 మంది అవసరం ఉండగా.. 70 మంది మాత్రమే ఉన్నారు. మాటేగావ్ నుంచి 1.5 మిలియన్ లీటర్లు తక్కువగా సరఫరా అవుతుండడంతో, మూడు వార్డుల్లో సమస్య వస్తోంది.
భైంసాలో వృథా..
భైంసాటౌన్:భైంసా పట్టణంలో 26 వార్డులుండగా, 12,900 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు అన్నివార్డుల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. కానీ, ౖపైపెన పైపులు వేయడంతో వాహనాల రాకపోకలతో అవి పగిలిపోయి లీకవుతున్నాయి. నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలాచోట్ల ఆన్‌ఆఫ్ లేక నీరు వృథాగా పోతోంది. కొన్ని కాలనీలకు ఇప్పటికీ భగీరథ నీరు రావడం లేదు. భట్టిగల్లి, భాగ్యనగర్, రాహుల్‌నగర్, తదితర కాలనీల్లో మున్సిపల్ బోరు నీటినే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, భట్టిగల్లిలో బోరుమోటారు చెడిపోయి కొద్దిరోజులు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదని కాలనీవాసులు తెలిపారు. పట్టణంలో 170 కి.మీ మేర నల్లా నీటి పైప్‌లైన్ ఉండగా, స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి రోజుకు 12 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు.
బోరు నీరే దిక్కు..
మా కాలనీలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు వేశారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా చేయడం లేదు. మున్సిపల్ బోరు మోటారు ద్వారానే నీటిని అందిస్తున్నారు. బోరు నీటినే తాగుతున్నాం.
– గోదావరి, రాహుల్‌నగర్, భైంసా
భగీరథ రాలేదు..
మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా కావడం లేదు. కాలనీలోని బోరు మోటారు నీటినే వాడుతున్నాం. తాగడానికి బోరు నీటినే వినియోగిస్తున్నాం.
– నేహ, రాహుల్‌నగర్, భైంసా
నీటి కొరత లేకుండా చర్యలు..
పట్టణంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిరోజుల ముందు మిషన్ భగీరథ రంగు నీళ్లని టెస్టింగ్ చేయించాం. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పరిష్కరించాం. కొన్ని చోట్ల విద్యుత్ శాఖ మరమ్మతుల వల్ల పైపులైన్లు పడిపోయాయి. వాటికి కూడా మరమ్మతులు చేయించి సమస్య లేకుండా చూస్తున్నాం. – జగదీశ్వర్‌గౌడ్,
మున్సిపల్ కమిషనర్, నిర్మల్
అందని ‘భగీరథ’..
ఖానాపూర్:ఖానాపూర్ పట్టణంలో ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతూనే ఉంది. ఈసారి మున్సిపల్ అధికారులు ముందస్తుగా ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా.. కొన్ని కాలనీలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోంది. స్లమ్ ఏరియాలైన సుభాష్ నగర్‌తోపాటు డబుల్ బెడ్‌రూం కాలనీల్లో నీటి సమస్య ఉండడంతో ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 5,300 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అమృత్ పథకం కింద రూ.22 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా
Comments
Please login to add a commentAdd a comment