గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

Published Wed, Mar 12 2025 7:33 AM | Last Updated on Wed, Mar 12 2025 7:29 AM

గ్రూప

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్‌–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.
250 ర్యాంక్‌ సాధించిన అశోక్‌కుమార్‌
● ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు ర్యాంకులు

191 ర్యాంకు సాయిరాం

కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్‌–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్‌ గ్రూప్‌–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్‌ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్‌–4లో రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్‌గా సెలెక్ట్‌ కావడంతో పాటు గ్రూప్‌–1 మెయిన్స్‌లో 436 మార్కులు సాధించాడు.

97వ ర్యాంక్‌

లెక్కల శ్రావణ్‌

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్‌ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్‌, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్‌తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్‌ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్‌–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్‌ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్‌ సాధించాడు. గ్రూప్‌–1లోనూ 404 మార్కులు సాధించాడు.

మెరిసిన ‘బజార్‌హత్నూర్‌’ యువకులు

బజార్‌హత్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్‌, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్‌ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్‌ ప్రస్తుతం ఆదిలాబాద్‌ ట్రెజరీలో జూనియర్‌ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్‌ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్‌ ముఖేష్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు.

తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్‌ కుమార్‌ గ్రూప్‌–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్‌ సాధించాడు. ప్రస్తుతం జైనథ్‌ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్‌ అందించిన సహకారంతో గ్రూప్‌–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్‌ కుమార్‌ పేర్కొటున్నాడు.

337వ ర్యాంకు

సాధించిన వెంకటేశ్‌

నస్పూర్‌: మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన పోలంపల్లి వెంకటేశ్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్‌వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్‌గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్‌ డిగ్రీ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

సత్తా చాటిన యువకులు

నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్‌, ఉష దంపతుల కుమారుడు సుమంత్‌ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్‌రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్‌ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

19వ ర్యాంక్‌ శివకృష్ణ

ఆసిఫాబాద్‌అర్బన్‌/ఆసిఫాబాద్‌రూరల్‌: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్‌ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్‌స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్‌–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆడిట్‌ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

188వ ర్యాంకు సాయికృష్ణ

సారంగపూర్‌: నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్‌–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్‌ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్‌ హైదరబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్‌ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు.

గ్రూప్‌–1 ఫలితాల్లో సత్తా

నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్‌ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్‌ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్‌ థామస్‌ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌లోని గురుకులంలో, ఇంటర్‌ నారాయణ జూనియర్‌ కాలేజీలో, బీటెక్‌ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.

గోలేటివాసికి 229వ ర్యాంకు

రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్‌ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్‌–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్‌లైన్‌లో కోచింగ్‌, సొంత ప్రిపరేషన్‌తో గ్రూప్‌–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్‌ అంటున్నాడు.

భాస్కర్‌

శ్రావణ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 1
1/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 2
2/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 3
3/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 4
4/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 5
5/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 6
6/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 7
7/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 8
8/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 9
9/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 10
10/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు 11
11/11

గ్రూప్‌–2లో మెరిసిన మనోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement