నిర్మల్‌ఖిల్లా: తొలి తెలుగు మహిళా కవయిత్రి, మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాల ను జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ కూ డలిలోని విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, పట్టణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం (కేవ) ఆధ్వర్యంలో మొల్లమాంబ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుమ్మరుల ఆరాధ్య దైవం మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, కుమ్మరుల సంక్షేమం కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేపట్టాలని, కుమ్మరులను బీసీ–ఏలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, కేవా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్, జిల్లా కోశాధికారి టి.శంకర్, కేవా ప్రధాన కార్యదర్శి పి.సాయన్న, తోడిశెట్టి రవి కాంత్, చంద్రయ్య, స్వామి, మధు సిలారి, నారాయణ, శ్యాంసుందర్, కృష్ణసాగర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.