
సమీకృత గురుకులాలేవి?
● ఉమ్మడి జిల్లాలో రెండు మాత్రమే..
● ముధోల్‌లో ఏర్పాటుకు వినతులు
భైంసా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, మంచిర్యాలకు మాత్రమే సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ముధోల్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పేదవారే అధికం. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.11,600 కోట్లతో 58 సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ జాబితా కూడా విడుదల చేసింది. బాసర సరస్వతీ అమ్మవారు కొలువుదీరిన నిర్మ ల్ జిల్లాకు ఒక్కటైనా మంజూరు చేయలేదు.
ఒక్కో గురుకులంలో ఇలా..
ఒక్కో గురుకులంలో ప్రయోగశాలలు, గ్రంథా లయాలు, మినీ థియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్ చేశారు. ఒక్కో లైబ్రరీలో 5వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డి జిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. 900 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్‌హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతీ డార్మెటరీలో పది బెడ్లు, రెండు బాత్‌రూమ్‌లు, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సదుపాయాలు కల్పించనున్నారు.
వినతిపత్రాలు ఇచ్చినా...
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ముధోల్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు, వినతులు వెళ్లాయి. గత నెలలో ముధోల్ మాజీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. గతంలో సేకరించిన స్థలంలో దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమీ కృత గురుకులాల ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జాబితాలో నిర్మల్ జిల్లాకు ఒక్కటీ లేదని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. ఇప్పటివరకు గురుకులాల ఏర్పాటుపై తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.