● భక్తిశ్రద్ధలతో కామ దహనం ● పలుగ్రామాల్లో హోలీ ప్రారంభం
నిర్మల్: ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రంగులు, సంతోషం, సామూహిక ఆనందం, మంచి చెడు మధ్య పోరాటాన్ని సూచిస్తుంది. ఈ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పే వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీ బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేస్తుంది. వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచే పండుగ సందడి మొదలైంది. రాత్రి కామదహనం నిర్వహించారు. పలు గ్రామాల్లో కాముడు కాల్చగానే హోలీ పండుగను ప్రారంభించారు. రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యాసంస్థల్లోనూ ముందస్తు హోలీ నిర్వహించారు. పండుగ విశేషాలను పిల్లలకు వివరించారు. ఇక జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
కోలలు, కొప్పుల సందడి..
హోలీ పండుగ వస్తుందంటే గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు, కూడళ్లవద్ద పెద్దలు, యువకులు అంతా కలిసి రాత్రిపూట కోలాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. లయబద్ధంగా పాటలు పాడుతూ ఒకరికొకరు కోలలు వేసుకుంటూ అలా చుట్టూ తిరుగుతుండటం ఆకట్టుకుంటుంది. జిల్లా కేంద్రంలోనూ బాగులవాడ, నగరేశ్వరవాడ, వెంకటాద్రిపేట, ద్యాగవాడ తదితర గల్లీల్లో ఇప్పటికీ కోలాలు వేస్తున్నారు. గురువారం రాత్రి కోలలు వేశారు. తరాలు మారుతున్నా ఇప్పటికీ జిల్లాలోని చాలా గ్రామాల్లో కోలలు, జడకొప్పులనూ వేయడం ఆనవాయితీగా సాగుతోంది.
తానూరు మండలంలో కామదహనం కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న గ్రామస్తులు
● భక్తిశ్రద్ధలతో కామ దహనం ● పలుగ్రామాల్లో హోలీ ప్రారంభం
● భక్తిశ్రద్ధలతో కామ దహనం ● పలుగ్రామాల్లో హోలీ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment