పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్
నిర్మల్‌చైన్‌గేట్: ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. కలెక్టర్లు, ఈఆర్‌వోలతో హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతోపాటు ఈఆర్‌వోలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్‌లు ఏర్పాటు చేసి అప్‌డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. సమావేశాల వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు పంపించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్‌రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment