అటవీ అధికారుల తీరుపై నిరసన
ఖానాపూర్: మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో నివాసం ఉంటున్న గోనె స్వా మి–మల్లీశ్వరి దంపతుల ఇంటిని అటవీశాఖ అధి కారులు అక్రమంగా, కక్షపూరితంగా కూల్చివేయడంపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. బాధ్యులపై చర్య తీ సుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబీకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నిరుపేద గుడిసెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. గతంలో భూపోరాటం ద్వారా 40 కుటుంబాలు నివసిస్తుండగా అధికారులు బాధిత కుటుంబానికి అన్యాయం చేయడం సరికాదన్నారు. 2005 నుంచి 2009 వరకు ఇంటి పన్ను చెల్లించడంతోపా టు 2008లో ఇందిరమ్మ ఇంటిని సైతం నిర్మించార ని పేర్కొన్నారు. అనంతరం ఎఫ్‌డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, దుర్గం లింగన్న, ప్రసాద్, స్వామి, శేఖర్, గంగన్న, కై లాస్, శ్రీనివాస్, చంద్రకళ, సావిత్రి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment