కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో సమగ్ర జాబితా సర్వే
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బి) అట వీ ప్రాంతంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏడీ సంపత్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంత అభివృద్ధి, పెరుగుతున్న మొక్కలు, తదితర సమ గ్ర జాబితా సర్వేను నిర్వహించారు. ఈసందర్భంగా అడవుల్లో అటవీశాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అడవుల్లో పెరుగుతున్న వృక్షసంపద, గడ్డిజాతుల పెరుగుదల తదితర అంశాలను గురించి సర్వే చేపట్టారు. అటవీ సంపద పరిరక్షణలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో నజీర్‌ఖాన్, కౌట్ల(బి) బీట్ అధికారి స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment