
అంత్యక్రియలు
పోలీస్ జాగిలానికి
నిర్మల్ టౌన్: జిల్లాలో పోలీస్‌శాఖకు విశేష సేవ లందించిన హంటర్ అనే జాగిలం గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా హంటర్‌కు పోలీస్ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఎస్పీ జానకీ షర్మిల జాగిలానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 1, 2022 నుంచి నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ పలు హత్యలు, చోరీ కేసులను ఛేదించడంలో హంటర్ సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐలు ప్రేమ్‌కుమార్, కృష్ణ, జాగిలం సంరక్షకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.