రైతు సంక్షేమానికి కృషి చేయాలి
కడెం: నూతనంగా నియమితులైన ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్ (భూమన్న), వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు శనివారం ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొజ్జు నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటు పడాలని, రైతు లేనిదే దేశం లేదని, రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, బరుపటి రమేశ్‌వర్మ, మల్లేశ్‌యాదవ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు యాదగిరి, జలజ, విఠల్, నారాయణ, నాయకులు వాజీద్‌ఖాన్, రాజు, రమేశ్, ఆకుల లచ్చన్న, దేవందర్‌గౌడ్, రాజన్న తదితరులున్నారు.