ఊరూవాడా తెలిసేలా..
నిర్మల్
ఆశాజనకంగా నువ్వు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే నువ్వు సాగుపై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఈసారి 25వేల ఎకరాల్లో పంట సాగు చేశారు.
శుక్ర : 4:57
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
9లోu
‘అడెల్లి’ ఆదాయం లెక్కింపు
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారికి భక్తులు కానుకలు, నగదు రూపేణా సమర్పించిన హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవికిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ద్వారా రూ.36,46,375, 210 గ్రాముల మిశ్రమ బంగారం, 4కిలోల 700 గ్రాముల మిశ్రమ వెండి సమకూరింది. అడెల్లి, కౌట్ల(బి), సారంగపూర్ గ్రామాల మహిళా భక్తులు, ఈవో రమేశ్, సిబ్బంది, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతుభరోసా సమాచారం
మండలం రైతుల పొందిన
సంఖ్య సొమ్ము
భైంసా 9,893 9,72,20,052
కుభీర్ 11,819 2,89,75,074
కుంటాల 5,346 5,33,20,656
దస్తురాబాద్ 4,688 4,05,24,211
కడెం 9,624 8,31,67,971
ఖానాపూర్ 8,091 6,57,16,939
పెంబి 4,731 5,50,41,040
బాసర 4,412 4,16,24,813
లోకేశ్వరం 9,269 8,11,52,459
ముధోల్ 8,107 7,73,30,185
తానూరు 9,475 9,70,20,198
దిలావర్‌పూర్ 5,166 4,30,52,722
నర్సాపూర్ (జి) 5,454 4,90,98,665
సారంగపూర్ 10,157 8,75,12,506
సోన్ 6,017 4,66,27,139
లక్ష్మణచాంద 7,224 5,46,42,027
మామడ 8,436 7,82,92,243
నిర్మల్ రూరల్ 7,584 5,80,95,122
నిర్మల్ అర్బన్ 528 23,34,524
దస్తురాబాద్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ (ఫైల్)
నిర్మల్‌చైన్‌గేట్: రుణమాఫీ సరిగా చేయలేదని, రైతుభరోసా ఇవ్వలేదని విపక్షాలు కాంగ్రెస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లబ్ధిపొందిన రైతుల పేర్లతో ఫ్లెక్సీలు ముద్రించి ఒక్కో గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది.. రైతు భరోసా ఎంత వచ్చింది.. లాంటి వివరాలతో కూడిన జాబితాను గ్రామాల్లో ప్రదర్శించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భావిస్తోంది. తద్వారా గ్రామపంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధిపొందాలని యత్నిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
రుణమాఫీ, రైతు భరోసా వివరాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగు విడతల్లో జిల్లాలోని 71,565 మంది రైతులకు రూ.658.61 కోట్లు మాఫీ చేసింది. రైతు భరోసా పథకాన్ని గత జనవరి 26వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు సాయంగా రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మూడెకరాలలోపు రైతులందరికీ రైతుభరోసా సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో 1,36,021 మంది రైతులు రూ.124,07,48,546 రైతు భరోసా సా యం పొందారు. ఈ నెలాఖరులోగా మిగతా రైతులందరికీ సర్కారు సాయం అందించనుంది.
ఫ్లెక్సీల్లో ఏం ముద్రిస్తారంటే..
ఒక్కో గ్రామంలో కనీసం 300–500 వరకు రైతులుంటారు. వీరిలో రుణమాఫీ వర్తించిన వారు తక్కువ మంది ఉన్నా, రైతు భరోసా అందిన వారు 90 శాతానికి పైగా ఉంటారు. ఫ్లెక్సీల్లో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, బ్యాంక్ అకౌంట్, రుణమాఫీ ఎంత అయింది.. రైతు భరోసా కింద ఎంత జమ అయింది.. తదితర సమాచారం ఫ్లెక్సీల్లో ముద్రించనున్నారు. ఒక్కో ఫ్లెక్సీని 6x3 సైజ్‌లో ప్రింట్ చేయించనున్నారు. లబ్ధిదారులందరి పేర్లు ముద్రించాలంటే ఐదు ఫ్లెక్సీలు అవసరం. ప్రతీ గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ప్రదర్శించాలంటే కనీసం 15 ఫ్లెక్సీలు కావాలి. ఈ లెక్కన జిల్లాలో 400 గ్రామాలకు గాను 6వేల ఫ్లెక్సీలు అవసరం. ఒక్కో ఫ్లెక్సీకి జీఎస్టీతో కలిపి రూ.350కి మించొద్దని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో షరతు విధించింది. ఈ మేరకు ఫ్లెక్సీలు ప్రింట్ చేయించేందుకు జిల్లాలవారీగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటివరకు రుణమాఫీ వివరాలు
మండలం రైతుల సంఖ్య చెల్లించిన
సొమ్ము
(రూ.కోట్లలో)
బాసర 3,429 38.16
దస్తురాబాద్ 2,425 20.6
దిలావర్‌పూర్ 3,256 42.5
కడెం 4,168 52.7
ఖానాపూర్ 5,081 44.5
కుభీర్ 5,739 55.79
కుంటాల 3,862 36.1
లక్ష్మణచాంద 3,654 29.54
లోకేశ్వరం 3,782 52.4
భైంసా 5,782 5.79
తానూరు 6,105 56.57
సోన్ 4,256 46.59
సారంగపూర్ 4,900 41.2
పెంబి 1,649 16.9
నిర్మల్ అర్బన్ 153 1.07
నిర్మల్ రూరల్ 2,998 25.4
నర్సాపూర్ (జి) 2,460 22.4
ముధోల్ 4,648 43.8
మామడ 3,218 26.6
ఒకరిపై కేసు నమోదు
సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రా మానికి చెందిన నల్ల మాధవరెడ్డి పదేపదే ‘డయల్ 100’కు కాల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగం చేసినందుకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించే ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసేవా రిపై కేసులు తప్పవని హెచ్చరించారు.
గురు : 6:25
ఇఫ్తార్
న్యూస్‌రీల్
రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలతో ఫ్లెక్సీల ఏర్పాటు
ప్రతీ గ్రామంలో మూడుచోట్ల ప్రదర్శన
ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌గానే..
చిత్తశుద్ధి నిరూపణకే సర్కారు యత్నం
ఆదేశాలు వచ్చాయి
జిల్లావ్యాప్తంగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకుంటాం. ఫ్లెక్సీల్లో లబ్ధిపొందిన రైతుల పేర్లు ముద్రించి గ్రామాల్లో ప్రదర్శిస్తాం. – అంజిప్రసాద్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఊరూవాడా తెలిసేలా..
ఊరూవాడా తెలిసేలా..