ఉపాధి పనుల పరిశీలన
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. కూలీల హాజరు, చేపట్టిన పనుల గురించి తెలుసుకున్నారు. రాచాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. యూ నిఫాంల పంపిణీ గురించి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించా రు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నర్సరీల్లో షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్‌ఖాన్, ఏపీవో ప్రమీల, టీఏలు దినేశ్, భీమ్ తదితరులు పాల్గొన్నారు.