కడెం: కడెం ప్రాజెక్ట్‌ను శుక్రవారం ‘స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్’ బృందం సభ్యులు రిటైర్డ్ సీఈ, ఐడ్రో మెకానికల్ ఎక్స్‌పర్ట్ కె.సత్యనారాయణ, స్టేట్ డ్యాం సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల సందర్శించారు. ప్రాజెక్ట్ వరద గేట్లు, కౌంటర్ వెయిట్‌లు, లిఫ్టింగ్ రోప్‌లను పరిశీలించారు. వరద గేట్ల ఆపరేటింగ్ సమస్యలు, ప్రాజెక్ట్ స్థితిగతులను ఎస్‌ఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. ఇందులో ఈఈ విఠల్‌రాథోడ్, డీఈ నవీన్, విజయలక్ష్మి, గణేశ్, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
సీల్ట్ ఏజెన్సీ బృందం సందర్శన
నీటిపారుదల శాఖ కడెం ప్రాజెక్ట్ పూడికతీత టెండర్ల ప్రక్రియను ఈనెల 27న, పూర్తి చేసి, పనులను ఏజెన్సీకి అప్పగించారు. శుక్రవారం ఏజెన్సీ సిబ్బంది కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఏజెన్సీ పేరు, వివరాలు కరీంనగర్ సీఈ పరిధిలో ఉంటాయని, టెండర్ గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎస్‌ఈ రవీందర్ తెలిపారు.