
పని ప్రదేశంలో వసతులు కల్పించాలి
ముధోల్: ఉపాధిహామీ కూలీలకు పని ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తానూర్, బాసర, ముధోల్ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కొలతల ప్రకా రం పనులు చేపట్టాలన్నారు. ఎండలు ఎక్కువ ఉన్నందున ఉదయాన్నే కూలీలను పని ప్రదేశాలకు తీసుకెళ్లి త్వరగా పనులు ముగించేలా చూడాలన్నారు. ఫాంపాండ్, చేపల కుంటలు, పొలాలకు వెళ్లే రోడ్లు, భూమి చదును, పొలాలకు మట్టిని తరలించడం వంటి పనులు చేపట్టాలని తెలిపారు. సమీక్షలో ముధో ల్, తానూర్, బాసర, ఎంపీడీవోలు శివకుమార్, అశోక్, నజీరొద్దీన్, ఏపీవోలు శిరీష, సదానందచారి, శివలింగం పాల్గొన్నారు.