
15 నుంచి సీపీఐ జాతీయ మహాసభలు
నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 15 నుంచి మూడు రో జులపాటు చైన్నెలో సీపీఐ జాతీయ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి విలాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని రైతు సమస్యలపై, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పోరాటాలు చేశామన్నారు. రైతు పండించే పంటలకు సకాలంలో నీరు అందించాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న చెక్‌డ్యాంలు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎన్.రెడ్డి, యల్‌ఆర్.ఉపాలి, రాజన్న, విఠల్ పాల్గొన్నారు.