
● కవితలు, వ్యాసాలు, కథలతో సాహిత్యసేవ ● ఎన్నో పురస్కారాల
నిరుపేద కుటుంబ నేపథ్యం..
ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల దృపతి –పోశెట్టి దంపతులకు తొమ్మిది మంది పిల్లలు. తొమ్మిదో సంతానంగా రెడ్ల బాలాజీ జన్మించారు. పాఠశాలకు ఇచ్చే సెలవు రోజుల్లో తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. ఇలేగాంలో ఐదవ తరగతి వరకు చదివిన బాలాజీ పక్క ఊరు దేగాంలో 6 నుంచి 10వ తరగతి వర కు చదివారు. ఈ ఐదేళ్లపాటు రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు. భైంసాలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే పిల్లలకు ట్యూషన్‌లు చెబుతూ ప్రైవే టు పాఠశాలలో పనిచేస్తూ గుంటూరులో బీఈడీ పూర్తిచేశారు. ఈ క్రమంలోనే పోస్టాఫీసులో బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం సాధించారు.
సాహిత్యంపై మక్కువ..
కవితలు, వ్యాసాలు, కథలు రాస్తూ బాలాజీ అందరికి తనలో ఉన్న సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఇప్పటికే ఇలేగాం గ్రామంలో ఉన్న బాపూజీ మహరాజ్ చరిత్ర, గీత శక్తి, వసుధ వాణి, మధుర వాణి, గీతవాణి వంటి ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలకు వాణిశ్రీ పురస్కారం, నంది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారాలు లభించాయి. పలు వేదికల్లో రెడ్ల బాలాజీకి స్వర్ణ కంకణం, బంగారు పతకం అందించారు. సాహితీ రత్న, ఆదర్శరత్న, గౌతమి కవి శ్రేష్ఠ, కవి సామ్రాట్ వంటి బిరుదులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో రాణించిన రెడ్ల బాలాజీకి అప్పటి నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రశంసాపత్రం అందించారు. ఇటీవలే ఆయన రచనలకుగాను డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ప్రముఖ కవి రచయిత డాక్టర్ శ్రీధర్, ప్రముఖ డైరెక్టర్ వి.సముద్ర చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. బాలాజీ తనకు వీలు కలిగినప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. చిన్నప్పుడు తానుపడ్డ కష్టాలు, ఎదురైన అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు వివరించి విద్యార్థులకు ధైర్యం చెబుతున్నారు.