
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జైపూర్: జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన సంధ్యారాణి (40) కుటుంబసభ్యులతో కలసి మంచిర్యాలలోని బంధువుల ఇంటికి వచ్చింది. కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద జైపూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి విక్రేతల అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని మార్కెట్ యా ర్డు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూ సి పరుగులు తీయడంతో అనుమానం వ చ్చి వారిని వెంబడించగా 210 గ్రాముల గంజాయి లభించింది. దీంతో వారిపై కేసు నమో దు చేసి ద్విచక్ర వాహనంతో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
యాక్సిడెంట్ కేసులో నిందితునికి జైలు
సోన్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి తొమ్మిది నెలల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. 2016లో సోన్ బ్రిడ్జి వద్ద ద్విచ క్ర వాహనం ఢీకొట్టడంతో గంగయ్య మృతి చె ందగా అతని భార్యసంగర్తనకు గాయాలయ్యా యి. ఇందుకు కారణమైన కొండ సంతోశ్‌గౌ డ్‌కు న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.
12 డొమెస్టిక్ సిలిండర్ల సీజ్
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని పలు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, స్వీట్‌హౌజ్‌లలో మంగళవారం అధికారులు త నిఖీలు నిర్వహించి 12 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ప్రేంని వా స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే వాడాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి