
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
నిర్మల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు, సాధారణ కాన్పులు పెంచేలా కృషిచేసిన ఆశ కార్యకర్తలు సవిత, రుక్మిణి, మమత ను గురువారం సన్మానించారు. ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ అరవింద్ , డాక్టర్లు శ్రీనివాస్, సౌమ్య, రాకేష్, ప్రియాంక, శైలజ, నర్సింగ్ అధికారులు అన్నపూర్ణ, జ్యోతి, లలిత పాల్గొన్నారు.