
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వేడి గాలులు వీస్తాయి.
ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 721 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 87 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పై జాన్ అహ్మద్, జిల్లా విద్యాధికారి రామారావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్ ఆచారి, ఎంజేపీ విద్యాసంస్థల జిల్లా కన్వీనర్ గీత, పర్యవేక్షకుడు రమణారెడ్డి పరిశీలించారు.
లక్ష్మణచాంద: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి మండలంలోని రాచాపూర్ ఎంజేపీ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ ప్రరీక్ష సజా వుగా ముగిసింది. 240 మంది విద్యార్థులకు 221 మంది పరీక్షకు హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు సీఎస్ సాయికృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ రాజు తదితరులున్నారు.