
నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలో ఈ నెల 5 నుంచి 79వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం జరుగనుంది. జిల్లా కేంద్రంలోని మారుతినగర్ కలెక్టరేట్ బైపాస్‌రోడ్డు హనుమాన్ ఆలయం వెనుక ఖాళీ స్థలంలో దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 16రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగనున్నాయి. అయుత చండీ,
తిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకాలు నిర్వహించనున్నారు. యాగాలు చేయనున్నారు. దీనికిగాను ప్రత్యేకంగా వేసిన యాగశాలలో యజ్ఞకుండాలను ఏర్పాటు చేశారు.
అందరికీ ఉచితం..
యాగంలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ధ్యానం, ఉపనిషత్ భాష్యం, ఉదయం 11 గంటలకు మద్భగవద్గీత, భాగవతంపై స్వామిజీ అమృత భాష్యాలు ఉంటాయి. ఈ యాగంలో, పూజల్లో, హోమంలో, అభిషేక, అర్చనల్లో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు. –కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ
క్రైం కార్నర్


Comments
Please login to add a commentAdd a comment