మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Published Sun, Mar 9 2025 1:33 AM | Last Updated on Sun, Mar 9 2025 1:31 AM

మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు, యువత మహనీయుల వీరగాథలతో స్ఫూర్తి పొంది నవభారత నిర్మాణం చేయాలని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇఫ్లూ) కమ్యూనికేషన్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కే రాజారామ్‌ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఘ్‌ (ఏబీఆర్‌ఎస్‌ఎం) నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వర్సిటీలో రాణీ అహిల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ రాజారామ్‌ మాట్లాడుతూ... వ్యక్తిగత జీ వితంలోని విషాదాలను అధిగమించి మూడు దశాబ్దాలపాటు మాల్వా రాజ్యంలో అహిల్యాబాయి పరిపాలన కొనసాగించారని తెలిపారు. యుద్ధరంగంలో ఆమె చూపిన తెగువ, పాలన సంస్కరణలు తెచ్చిన విధానం, సామాజిక సమరసత కోసం చేసిన కృషి, కాశీ విశ్వనాథ్‌, సోమనాథ్‌ ఆలయాల పునరుద్ధరణలో పోషించిన పాత్రను రాజారామ్‌ గుర్తు చేశారు. వర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారె దస్తగిరి మాట్లాడుతూ యు వత రాణి అహిల్యాబాయి జీవితగాథ స్ఫూర్తితో గొప్ప పనులు చేయడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెయూ అధ్యాపకులు వాసం చంద్రశేఖర్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌ నర్స య్య, తెయూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్లూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజారామ్‌

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement