లయన్స్ కంటి ఆస్పత్రిలో ‘ఆరోగ్య శ్రీ’
బోధన్: బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావు, చైర్మన్ నర్సింహారెడ్డితో కలిసి శనివారం ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. అధునాతన వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఐ స్క్రీనింగ్ టెస్ట్ మొబైల్ వ్యాన్‌ను పరిశీలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు లయన్స్ కంటి ఆస్పత్రికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారికి ద్వారా పైసా ఖర్చు లేకుండా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని వివరించారు. ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొడాలి కిశోర్, శ్రీనివాస్‌రావు, ఉమేశ్ షిండే తదితరులు పాల్గొన్నారు.
సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment