సంతోషంగా ఉంది
మా నాన్న వ్యవసా య కూలీగా పని చే స్తూ నన్ను చదివించా రు. ఎలాగైనా ప్రభు త్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి తల్లిదండ్రుల కోరిక నెరవేర్చా.శిక్షణ పూర్తి చే సుకోవడం సంతోషంగా ఉంది. ఇక్కడ క్ర మశిక్షణతోపాటు అన్ని అంశాల్లో తర్ఫీదు పొందాను.
– ఎస్ దేవయ్య, రంగారెడ్డి జిల్లా
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించాను. కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగానే ప్రైవేట్ జాబ్ వదిలి ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం సాధించి ఏఆర్ కానిస్టేబుల్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నా.
– సుకుమార్‌రెడ్డి, వికారాబాద్
ఎంతో నేర్చుకున్నా..
కానిస్టేబుల్ శిక్షణ సమయంలో ఎంతో నేర్చుకున్నా. మా నాన్న 14 ఏళ్ల క్రితం చనిపోయారు. అమ్మ లక్ష్మమ్మ, అన్న రాజు ప్రోత్సహించడంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. ఇద్దరికి నా జీవితాంతం రుణపడి ఉంటాను.
– జె నగేశ్, శంషాబాద్
అమ్మకు అండగా ఉంటా
మా అమ్మ లక్ష్మి అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తూ నన్ను పెద్ద చేసింది. నాన్న అనారోగ్యంతో 10 ఏళ్ల క్రితం మృతి చెందారు. కసితో చదివి కానిస్టేబుల్ జాబ్ సాధించాను. ఇప్పుడు మా అమ్మ, అక్కకు అండగా నిలుస్తాను.
– అనిల్, వెంకటాపూర్, రంగారెడ్డి జిల్లా
సంతోషంగా ఉంది
సంతోషంగా ఉంది
సంతోషంగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment