బహుమతుల ప్రదానం
నిజామాబాద్‌నాగారం: నగరంలోని అభ్యాస పాఠశాలలో స్కూల్ కరస్పాండెంట్ చిన్న శ్రీనివాస్ జ్ఞాపకార్థం మెమోరియల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా రెండు రోజుల పాటు నగరంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన నెట్‌బాల్ పోటీల్లో జిల్లాలోని 16 పాఠశాలలు పాల్గొన్నాయి. అదేవిధంగా అభ్యాస పాఠశాలలో చెస్, క్యారం, టేబుల్ టెన్నిస్, కోకో సహా పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ కరస్పాండెంట్ అన్నపూర్ణ, నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, అభ్యాస యాజమాన్యం డైరెక్టర్లు శ్రీనివాస్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment