నగరంలో అర్ధరాత్రి సీపీ తనిఖీలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలో సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట, ఎల్‌ఐసీ చౌరస్తా, దేవీరోడ్డు చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా, ఆర్‌ఆర్ చౌరస్తా, పెద్దబజార్, నెహ్రూపార్క్, హైమదీబజార్, బోధన్ బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆటోల ఆర్‌సీలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో రోడ్లపై తిరిగే యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలకు సలహాలు, సూచనలు చేశారు.
రోడ్లపై తిరుగుతున్న
యువకులకు కౌన్సెలింగ్
నగరంలో అర్ధరాత్రి సీపీ తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment