ఆరు గ్యారంటీలు ఎత్తేసి భట్టి ప్రకటించిన వొట్టి బడ్జెట్
2025–26 బడ్జెట్ తెలంగాణ ప్రజలను వంచించేలా ఉంది. అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా అబద్దాల చిట్టా చదివారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేమని చేతులెత్తేసినట్టే ఉంది. ఆర్థిక మంత్రి భట్టి వట్టి మా టలే చెప్పారు. కాకి లెక్కలతో అన్నివర్గాలను మో సం చేసినట్లు స్పష్టమైంది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.2,500, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయూత ద్వారా వృద్ధులకు, వితంతులకు పింఛన్ పెంపు, విద్యార్థినులకు ఉచిత స్కూ టీలు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఊసే లేదు. సగం కూడా రైతు రుణమాఫీ ఇవ్వకుండా పూర్తిగా ఇచ్చినట్లు చదివారు. కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసే లేదు. ఏ రంగానికి తగిన కేటాయింపులు లేవు. ఆదా యం ఎలా సమకూర్చుకుంటారు, రెవెన్యూ లోటు ఎంత అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. యువ వికాసం పేరుతో కాంగ్రెస్ నాయకుల వికాసానికి మాత్రం రూ.6వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment