కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే బడ్జెట్..
బడ్జెట్ కేవలం కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకునేవిధంగా ఉంది. మ హిళలకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, ఆటో కార్మికులకు, దళితులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇందూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ బడ్జెట్‌లో దీనిపై స్పష్టత లేదు. వ్యవసాయ కేటా యింపులు కేవలం రైతుభరోసాకు మాత్రమే సరిపోతాయి. రుణమాఫీ, రైతు కూలీలు, కౌలు రైతుల సంక్షేమానికి నిధులు ఇవ్వలేదు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ప్రస్తావన లేదు. తెలంగాణ యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు హామీ ఇచ్చినప్పటికీ దాని ఊసే లేదు. యువవికాసం పేరిట కాంగ్రెస్ కార్యకర్తలకు రూ.6వేల కోట్లు పంచడం సిగ్గుచేటు.
– కులాచారి దినే్‌శ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment