డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం

Published Fri, Mar 21 2025 1:34 AM | Last Updated on Fri, Mar 21 2025 1:30 AM

డీఎస్

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం

ఖలీల్‌వాడి: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సోషల్‌ వర్కర్‌ ఆర్‌ సురేందర్‌, న్యాయ రంగం నుంచి జీ రవి ప్రసాద్‌, వైద్య రంగం నుంచి డాక్టర్‌ కవితారెడ్డిని నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ లీగల్‌ ఎఫైర్స్‌ సెక్రెటరీ, లెజిస్టేటివ్‌ అఫైర్స్‌ అండ్‌ జస్టిస్‌ ఆర్‌ తిరుపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సభ్యులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది నాగేందర్‌, లైజనింగ్‌ ఆఫీసర్‌ శ్యామ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సిబ్బందికి కళ్లద్దాలు, వాటర్‌ బాటిళ్లు

ఖలీల్‌వాడి : ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సిబ్బందికి సీపీ పోతరాజు సాయిచైతన్య కళ్లద్దాలు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. రవీంద్ర మెడికల్‌ ఏజెన్సీ సౌజన్యంతో గురువారం కమిషనరేట్‌ కార్యా లయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిరోజూ మండుటెండను తట్టుకుని ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారన్నారు. సిబ్బందికి ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నా రు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ నారాయ ణ, సీఐ ప్రసాద్‌, రవీంద్ర ఫార్మసీ బాధ్యులు మధుసూదన్‌, సుధాకర్‌, సాయిలు, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాధుల నిర్ధారణ

పరీక్షలను పెంచండి

నిజామాబాద్‌నాగారం: అసంక్రమిత వ్యా ధుల నిర్ధారణ పరీక్షలను నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్ష్యం కంటే తక్కువ పరీక్షలు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బంది, ఏఎన్‌ఎం, ఎమ్‌హెచ్‌పీల పనితీరుపై స మీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ..

లక్ష్యాన్ని అందరూ ఈనెల చివరికల్లా పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో మెమోలు జారీ చేస్తామన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్‌సీ స్థాయిలలో అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరిగే తీరును ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా సమీక్షించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఎవరూ కూడా వడదెబ్బకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్‌, ఐవీ ఫ్లూయి డ్స్‌, అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కూలీల పనివేళల్ని ఉదయం 6 గంటల నుంచి 11 గంటలు లో పే ఉండేలా చూడాలని సూచించారు. ఎన్‌సీ డీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సామ్రాట్‌ యాద వ్‌, ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ పి.వెంకటేశం, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్‌ వెంకటేశ్వర్లు, హెచ్‌ఈవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం 1
1/3

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం 2
2/3

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం 3
3/3

డీఎస్‌ఏలో నూతన సభ్యుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement