పోలీసుల పేరిట డబ్బులు వసూలు.. యువకుడి అరెస్టు
రెంజల్(బోధన్): టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన యువకుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రెంజల్ ఎస్సై సాయన్న తెలిపారు. ఈ నెల 17న నిజామాబాద్‌కు చెందిన రఫీక్ అనే వ్యక్తి తన ఆటోలో ధర్మాబాద్‌కు నూకలు, బియ్యం తరలిస్తు న్నాడు. రెంజల్ మండలం కందకుర్తి బ్రిడ్జి వద్ద అదే గ్రామానికి చెందిన తానాజీ సతీశ్ తాను టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ ఆటోను ఆపాడు. రఫీక్‌ను బెదిరించి తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆటోను సీజ్ చేస్తాననడంతో బాధితుడు రూ. 3 వేలు ఫోన్ పే చే శాడు. ప్రతినెలా రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రఫీక్ అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరికి అనుమానం వచ్చి డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు డ బ్బులు వసూలు చేసిన సతీశ్ ఓ యూట్యూబ్ చానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
భిక్కనూరులో ఇద్దరిపై కేసు
భిక్కనూరు: విలేకరుల ముసుగులో డబ్బులు డి మాండ్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎ స్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన లింగాల నవీన్ గౌడ్, అర్జున్ విలేకరులమంటూ డబ్బులు డిమాండ్ చేశారని భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర మోటార్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment