ప్రతి ఇంటికీ మంచినీరందించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ఆయా పథకాల కింద నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి అమృత్ 2.0 పథకం పనుల ప్రగతిపై గురువారం సమీక్షించారు. వేసవి సీజన్‌లో నగరంలోని ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రోడ్లు, ఇతర పెండింగ్ పనులను పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నామని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్ మాస్టర్ ప్లాన్‌పై ఉన్నతాధికారులతో ఇటీవలే చర్చించామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలైతే నిజామాబాద్ నగరం మరింత వేగంగా అభివద్ధి చెందే ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే నగరపాలక సంస్థ పనితీరు కలెక్టర్ పర్యవేక్షణలో ఎంతో బాగుందని షబ్బీర్ అలీ ప్రశంసించారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే ధన్‌పాల్ పంపిణీ చేశారు. నిజామాబాద్ సౌత్, నార్త్ మండలాలకు చెందిన 565 మందికి రూ. 5.65 కోట్ల పైచిలుకు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా పేదలను ఆదుకోవడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తోందన్నారు.
మౌలిక సదుపాయాలను
మెరుగు పర్చాలి
మాస్టర్‌ప్లాన్‌పై అధికారులతో చర్చించాం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్ నగరంలో
అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment