నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
నిజాంసాగర్(జుక్కల్): ఇంటి ఎదుట సరదాగా ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం సింగీతంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సింగీతం గ్రామానికి చెందిన బిచ్చం గజ్జెలయ్యకు ఇద్దరు భార్యలు. చిన్న భార్య సుశీల కూతురు దుర్గాభవాని(3) బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి పశువుల నీటి తొట్టిలో పడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న దుర్గాభవానీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి నీటితొట్టిలో చూడగా అప్పటికే చిన్నారి నీట మునిగి మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment