రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను విజయవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను విజయవంతంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఇందుకోసం జై బాపు– జై భీం– జై సంవిధన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేపడతామన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పాదయాత్ర కోసం ప్రతిఒక్కరు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, ఏబీ శ్రీనివాస్, నగేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమే ష్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జావేద్ అక్రమ్, రాంభూపాల్, గోపి, విపూల్‌గౌడ్, వేణురాజ్, నరేందర్‌గౌడ్, సంతోష్, లింగం, కెతావత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment