వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థుల సాగు పాఠాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకునేందుకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్‌కు శనివారం నిర్మల్ జిల్లా జామ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు వచ్చారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్న పలువురు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు, అధ్యాపకులు గ్రామంలో సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కరుటూరి పాపారావు క్షేత్రాన్ని సందర్శించారు. రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ విద్యార్థులు వివిధ అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థుల సాగు పాఠాలు
Comments
Please login to add a commentAdd a comment