డౌన్ సిండ్రోమ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నిజామాబాద్‌నాగారం: తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్‌ట్రక్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డౌన్ సిండ్రోమ్ నివారణకు చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి మాత్రమే మార్గ మని తెలిపారు. ఈ పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉంటారని, వారికి విద్యాబుద్ధులు నేర్పించా లని కోరారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలపై తల్లిదండ్రు లు ప్రేమానురాగాలు, ఎక్కువ శ్రద్ధ చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందన్నారు. అనంత రం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొ న్న డౌన్ సిండ్రోమ్ విద్యార్థులకు బహుమతులు ప్ర దానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌బి, వైద్యులు ప్రతిమారాజ్, రవితేజ, అవినాష్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment