సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: రౌడీషీటర్లపై పోలీసులు దృష్టి సారించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. వారు మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని నార్త్ రూరల్ సర్కిల్ కార్యాలయంతో పాటు ఐదవ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం సాయంత్రం పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డు, కంప్యూటర్ గదులను పరిశీలించి కేసుల వివరాలను సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్త్ సీఐ పరిధిలోని పీఎస్‌ల వివరాలను మ్యాప్‌ను పరిశీలించి అక్కడ ఉండే పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.